భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడమే లక్ష్యంగా ముందుకెళ్దాం
- పాత కొత్త తేడా లేకుండా కమిటీల ఏర్పాటు
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి
విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి లు
వనపర్తి, మార్చి 6 ( విజయక్రాంతి ) : భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ ని చేసేంతవరకు విశ్రమించకూడదని, ప్రతి ఒక్కరం సంఘటితంగా పనిచేసి క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి లు పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఈ నెల 9వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు బూ త్ స్థాయి కమిటీ, వార్డ్ కమిటీ, గ్రామ కమి టీ, మండల కమిటీ, పట్టణ కమిటీల ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం బూతు అధ్యక్షుడిని కూడా నియమిస్తుందన్నారు. ఓటు హక్కు ఉన్న బూ తులోనే అక్కడి నాయకుడు బూతు అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడని ఉదాహరణకు వన పర్తి ఎమ్మెల్యే కి మంగంపల్లిలో ఓటు హక్కు ఉందని ఓటు హక్కు ఉన్న బూత్ కి ఎమ్మెల్యే బూత్ అధ్యక్షుడిగా ఉంటారని వారు తెలిపారు.
వీటితోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాలను సైతం ఏర్పాటు చేస్తారని అలాగే ఎన్‌ఎస్ యుఐ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని ఎవరు కూడా నిరాశ చెందకుండా పార్టీ కోసం పని చేయాలని వారు సూచించారు. ఈ పత్రిక సమా వేశంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి , వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పె బ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, కౌన్సిలర్లు మాజీ పౌష్ లను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.




