27-07-2025 12:22:04 AM
న్యూఢిల్లీ, జూలై 26: ‘కార్గిల్ వీరుల త్యాగం ఎప్పటికీ దేశపౌరులకు స్ఫూర్తినిస్తూ నే ఉంటుంది. కార్గిల్ విజయ్ దివస్ సైనికుల అసాధారణ శౌర్యం, ధైర్యానికి ప్రతీక’ అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘భరతమాత కోసం ధైర్యవంతులైన సైనికులు తమ జీవితాలను అంకితమిచ్చారు.
జన్మనిచ్చిన నేల కోసం తమ సర్వస్వాన్ని ధారపో శారు. వారు ప్రతితరానికి స్ఫూర్తిగా నిలుస్తూ నే ఉంటారు’ అని పేర్కొన్నారు. ‘కార్గిల్ విజ య్ దివస్ మర్చిపోలేని రోజు. మన సైనికుల ధైర్యసాహసాలకు ప్రతీక. ‘ఆపరేషన్ వి జయ్’ ద్వారా మన సైనికులు శత్రుదేశ సైనికుల్ని మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఆ వీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంది’ అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సిం గ్ అన్నారు.
సీడీఎస్ అనిల్ చౌహాన్ కార్గిల్ వీరులకు నివాళి అర్పించిన అనంతరం భారత సైనికులకు, కార్గిల్ వీరుల కుటుంబాలకు శుభాకాంక్షలు చెప్పారు. కార్గిల్ వీరుల ధైర్యసాహసాలను కొనియాడారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా విజయం సాధించినట్టు చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో ఉన్న నేష నల్ వార్ మెమోరియల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌ హాన్, చీఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వి వేది, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్ష ల్ ఏపీ సింగ్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే. త్రిపాఠి పాల్గొని.. ఆనాడు యు ద్ధభూమిలో వీరమరణం పొందిన అమరవీరు లకు నివాళి అర్పించారు. ఇందుకు సం బంధించిన వీడియోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి.
కార్గిల్ వార్ మెమోరియల్‌లోనూ..
కార్గిల్ పోరులో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలు ద్రాస్ (కార్గిల్ వద్ద) మెమోరియల్‌లో ఘన నివాళి అర్పించాయి. అమరవీరుల కుటుంబాలతో పాటు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా కూడా కార్గిల్ అమరులకు నివాళులు అర్పించారు. దేశంలోని వివిధ పార్టీల నాయకులు కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు. పాకిస్థాన్ మీద 1999లో సాధించిన విజయానికి గుర్తుగా భారత్ ప్రతిఏటా జూలై 26వ తేదీని ‘కార్గిల్ విజయ్ దివస్’గా జరుపుకుంటుంది.
సైన్యంలో మరో కొత్త దళం
భారత సైన్యంలో శక్తిమంతమైన మరో కొత్త ద ళాన్ని ఏర్పా టు చేస్తున్నట్టు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. భవిష్యత్‌లో ఏర్పడే ముప్పును ఎదు ర్కొనేందుకు ఆల్‌ఆర్మ్స్ బ్రిగేడ్ ఏ ర్పాటు చేసినట్టు.. దానికి రుద్ర అ నే పేరు పెట్టినట్టు ఆయన పేర్కొన్నా రు.
ఈ యూనిట్ గురించి మాట్లాడుతూ ‘భవిష్యత్ అవసరాలు తీ ర్చుకోవడంతో పాటు ఏ ర్పడే సవాళ్లను విజయవంతంగా ఎ దు ర్కొ నేందుకు ఈ యూనిట్‌ను ఏర్పా టు చేశాం. పదాతిదళం, యాంత్రి క పదాతిదళం, సాయుధ యూ ని ట్లు, ఫిరంగి దళం, ప్రత్యేక దళా లు, మానవరహిత వైమానిక వ్యవస్థలు ఈ దళంలో ఉంటాయి. శత్రు వుల్లో వణుకుపుట్టించేందు కు భైరవ్ పే రుతో లైట్ కమాండో బెటాలియన్ ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు.