27-07-2025 12:14:21 AM
న్యూఢిల్లీ, జూలై 26: థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లో నెలకొన్న వివాదం కారణంగా తలెత్తిన ఘర్షణలు కొనసాగుతూ నే ఉన్నాయి. రెండు దేశాల ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 32కు చేరుకుంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో కం బోడియా తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. తమ లక్ష్యం శాంతియుత పరి ష్కారమని.. వివాదాలను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలని స్పష్టం చేసింది.
శనివారం రెండు దేశాల మధ్య జరిగిన ఘర్ష ణలో కంబోడియాకు చెందిన ఏడుగురు పౌ రులు, మరో ఐదుగురు సైనికులు మరణించినట్టు ఆ దేశ రక్షణశాఖ అధికార ప్రతినిధి ప్రకటించింది. వీరితోపాటు 50 మంది పౌరులు, 20 మంది సైనికులు గాయపడ్డట్టు తెలిపారు.. థాయ్‌లాండ్‌కు చెందిన చిన్నారితో సహా.. 13 మంది పౌరులు మరణించారు. అదనంగా 29 మంది థాయ్ సైని కులు, 30 మంది పౌరులు గాయాలపాలయ్యారు.
థాయ్‌లాండ్ సరిహద్దుల నుంచి ఇప్పటి వరకు 1,38,000 మంది పౌరులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో కంబోడియాలోని భారత దౌత్య కార్యాలయం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల దృశ్యా కంబోడియాలో నివసిస్తున్న భారత ప్రజలు సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణించొద్దని, ఏదైనా అత్యవసరమైతే రాయాబర కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది. 2008 నుంచి 2011 మధ్య ప్రెయా విహార్ పరిసరాల్లో పలుసార్లు ఘర్షణలు చెలరేగాయి. గత మే నెలలో సరిహద్దు వద్ద ఒక కంబోడియా సైనికుడిని హతమార్చడమే ప్రస్తుత ఘర్షణకు ప్రధాన కారణమని తెలుస్తోంది.