calender_icon.png 22 July, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడించాలి

22-07-2025 12:57:47 AM

  1. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామాలు, మండలాల అభివృద్ధి కోసం ఉద్ధరించిందేమీ లేదు
  2. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాల అభివృద్ధి
  3. బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు

కరీంనగర్, జూలై21(విజయక్రాంతి):త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులంతా సన్నద్ధం కావాలని నాయకులు కార్యకర్తలకు బిజెపి గెలుపే  ల క్ష్యం కావాలని, ఎన్నికల్లో కాషాయ జెండా రె పరెపలాడించాలని బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అన్నారు. బిజెపి జిల్లా శాఖ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన సోమవారం కరీంనగర్లోని శుభమంగళ గార్డెన్లో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల జరిగింది.

ఇట్టి సమావేశానికి ము ఖ్యఅతిథిగా హాజరైనఆయనమాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి శక్తి చెప్పడానికి సమయం ఆసన్నమైందన్నారు. నేడు భా రతీయ జనతా పార్టీ గ్రామ, మండలాల్లో బలమైన శక్తిగా అవతరించిందన్నారు.కేం ద్రంలోని మోడీ ప్రభుత్వం గ్రామాల, మండలాల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.

గ్రామాల్లో మండలాల్లో జరిగే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమా లు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయనే విషయం ప్రజలందరికీ అర్థమైంద న్నారు. ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలం తా విశ్వాసంతో ఉన్నారని, అందుకే జరగబో యే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ని అక్కు న చేర్చుకునే పరిస్థితిలో ఉన్నాయన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బి.ఆర్.ఎస్‌లను ప్రజ లు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.

ఆరు గ్యారంటీలు, 420 హామీలతో , అడ్డగో లు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్ర ధానంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అన్ గ్యారెంటీలయ్యాయన్నారు. కాంగ్రెస్ ముచ్చట్లన్ని ఉద్దెర ముచ్చట్లేనన్నారు. నేడు కాంగ్రెస్ ఉద్దరే ముచ్చట్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బి ఆర్‌ఎస్, కాంగ్రెస్ ల మొఖం చెల్లుబాటు అయ్యే స్థితులు లేవని పేర్కొన్నారు.

ప్రధానంగాగత బిఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్ లు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాయన్నారు. చేసిన అభి వృద్ధి పనుల బిల్లులు చెల్లించకుండా సర్పంచులను గోస పెట్టిన చరిత్ర బి ఆర్ ఎస్ కు ఉంటే , నేడు ఆ సర్పంచుల గోడు పట్టించుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామాలు, మండలాల అభివృద్ధి కోసం ఉద్ధరించింది , చేసిందిఏమీ లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. నేడు గ్రామాల్లో, మండలాల అభి వృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధుల తోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

కేంద్రం గ్రామాలు మండలాలు అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి పనులను ,  ప్రజా సంక్షే మం కోసం కేంద్ర అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు,  స్థానిక సంస్థల ఎన్నికల జి ల్లా కన్వీనర్ బాస సత్యనారాయణ రావు మాట్లాడుతూ జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులంతా సమాయత్తం కావాలని , ఆ మేరకు రాష్ట్ర పా ర్టీ తగిన  సూచనలు చేసిందని తెలిపారు. పా ర్టీ ఆధ్వర్యంలో మండలాల్లో, జిల్లా ల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆయన సంద ర్భంగా వివరించారు.

జిల్లా అధ్యక్షులు గంగా డి కృష్ణారెడ్డి ,మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రా ష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ళ పు రమేష్. బం గారు రాజేంద్ర ప్రసాద్, మేకల ప్రభాకర్ యాదవ్, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి.,వాసాల రమేష్. కన్నెబొయిన ఓదెలు , జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ,మాడ వెంకట రెడ్డి, బత్తుల లక్ష్మినారాణ,

పార్లమెం ట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం, ఎర్రబెల్లి సంపత్ రావు. కన్న కృష్ణ ,రంగు భాస్కర్ చా రి .కళ్లెం వాసుదేవ రెడ్డి లతో పాటు వివిధ మోర్ఛ జిల్లా మోర్చా బాధ్యులు , మండల తాజా మాజీ అధ్యక్షులు, జెడ్పీటీసీ ప్రబారి లు , మండల జెడ్పీటీసీ కన్వీనర్ లు మాజి జెడ్పీటీసీ లు, మాజీ ఎంపీపీలు , మాజీప్ర జా ప్రతినిధులు లు తదితరులుపాల్గొన్నారు.