calender_icon.png 22 July, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీల సంక్షేమమే బీజేపీ లక్ష్యం..

22-07-2025 12:58:47 AM

- స్థానిక సంస్థల్లో పార్టీ విజయానికి కృషి చేయాలి..

- ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, జూలై 21 (విజయక్రాంతి) : ఆదివాసుల సంక్షేమం, అభివృద్ధి కోసం దేశ ప్రధాని కృషి చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సోమవారం బేల మండలం బోరిగామ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులంత బీజేపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆదివాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసు కెళ్లారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గ్రామంలో నెలకొన్న రోడ్డు, మంచినీటి తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బోరిగామ గ్రామం పూర్తిగా ఆదివాసి గ్రామమని, సంవత్సరం లోపు గ్రామంలో నెలకొ న్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. గ్రామంలో ఇల్లు లేని వారి వివరాలను తన కు అందించాలని సూచించారు. ఆదివాసి పివిటీజీ ల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులను మంజూరు చేసిందని పేర్కొన్నారు. అంతకుముందు బేలా మండల కేంద్రంలో జరిగిన బీజేపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సదస్సులో  ఎమ్మెల్యే పాల్గొన్నారు. పార్టీ గెలిపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నగేష్, సుభాష్, రమేష్, విజయ్, రాము, సురేష్  పాల్గొన్నారు.