22-07-2025 12:57:18 AM
- ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులతో పాటు, అవసరమైన మందులు అందుబాటులో ఉండాలి
- కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం
నిర్మల్, జూలై 21 (విజయక్రాంతి): జిల్లా లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సీజన్ వ్యాధులను నియంత్రణపై సమీక్ష నిర్వహించారు వర్షాకాలం కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిరంతరం దోమలు, దోమల లార్వాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మెరుగైన పారిశుద్ధ్య పనులు నిర్వహించడం ద్వారా వ్యాధులను నియంత్రించవచ్చునని తెలిపారు.
అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులతో పాటు, అవసరమైన మందులన్నీ ప్రజ లకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నిరంతరం మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహించాలన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి జిల్లాలో మండలాల వారీగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను చేపట్టేందుకు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారుల సమన్వయంతో రైతులకు పంటలకు అవసరమయ్యే సాగునీరును అందించాలని పేర్కొన్నారు.
రైతులందరికీ సరిపడినంత యూరియా, డిఏపి, ఇతర ఎరువులను అందించాలని తెలిపారు. అన్ని ఎరువులు, మందుల దుకాణాలలో అందుబాటులో ఉన్న ఎరువులకు సంబంధించి వివరాలను ప్రదర్శించాలన్నారు. ఎరువులు పక్కదారి పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. అధిక వర్షాల వల్ల అకాల వర్షాలు సంభవిస్తే వరద నష్టాలను నివారించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇప్పటికే జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలు (ఎన్డీఆర్‌ఎఫ్) అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిపిఓ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, డిఎంహెచ్‌ఓ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, నీటిపారుద ల శాఖ అధికారులు రవీందర్, అనిల్, గణే ష్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.