calender_icon.png 11 July, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలి

11-07-2025 12:00:00 AM

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ

బాన్సువాడ జులై 8 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బిజెపి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు అధ్యక్షతన  నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి స్థానిక సంస్థల్లో కాషాయపు జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు, 420 వాగ్దానాలను ప్రజలకు వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యపరిచే బాధ్యత భాజపా కార్యకర్తలదేన్నారు.

ఈ సందర్భంగా తాడుకుల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సాయిలు, బీరుగొండ, రాములు, రమేష్ తదితరులు పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గురు పౌర్ణమి సందర్భంగా పురోహితులు రఘు, వేద ప్రకాష్, పుష్ప తదితరులను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ ఎండల లక్ష్మీనారాయణ బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోశెట్టి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మినారాయణ దొరబాబు.

జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి రూరల్ అధ్యక్షుడు శ్రీనివాస్ వర్ని మండల అధ్యక్షులు రమేష్ రుద్రూర్ మండల అధ్యక్షులు హరి చందూర్ మండల అధ్యక్షుడు విట్టల్ శ్రీకాంత్ పోతంగల్ మండల అధ్యక్షులు హనుమాన్లు బిజెపి సీనియర్ నాయకులు చిదుర సాయిలు శ్రీనివాస్ రెడ్డి ప్రసాద్ మోహన్ రెడ్డి చిరంజీవి ఉమేష్ రాజు శంకర్ గంగారాం మక్కన్న సున్నం సాయిలు సాయిలు యోగి తదితరులు పాల్గొన్నారు