calender_icon.png 9 December, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడోరోజూ అదే తంతు

09-12-2025 02:27:23 AM

  1. దేశవ్యాప్తంగా 50౦ ‘ఇండిగో’ విమాన సర్వీసుల్లో అంతరాయం
  2. సంస్థ సీఈవో, సీఓఓకు డీజీసీఏ సమన్లు
  3. రేపు విచారణ కమిటీ ఎదుట హాజరు ?

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశీయ విమా నయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో అంతరాయం ఇప్పటికీ కొనసాగుతున్నది. సోమవారం దేశవ్యాప్తంగా సుమారు 500 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఒకవైపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఏడోరోజూ కూడా అవే సమస్యలు తలెత్తాయి. డీజీసీఏ జారీ చేసిన నిబంధనల అమలులో ఇండిగో సంస్థ విఫలమవుతూనే వస్తున్నది.

ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి 134 విమాన సర్వీసులు, బెంగళూరు నుంచి 127, హైద రాబాద్ నుంచి 112, చెన్ను నుంచి 71, అహ్మదాబాద్ నుంచి 20 విమాన సర్వీ సులతోపాటు ఇతర విమానాశ్రయాల నుంచి మరికొన్ని సర్వీసులు రద్దయ్యాయి. ముంబై, కోల్‌కతా విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు కీలక ప్రకటన చేశారు.

సర్వీసుల అంతరాయం కొనసా గుతూనే ఉంటుందని, ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వచ్చేముందు ఫ్లుటై స్టేటస్ తనిఖీ చేసుకో వాలని సూచించింది. మరోవైపు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 1 వరకు 9,55,591 టికెట్లు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. వీటి విలువలో దాదాపు రూ.827 కోట్లను ప్రయాణికులకు రీఫండ్ చేసినట్లు వెల్లడిం చింది. ఈ నెల 1 నుంచి 7 వరకు 5,86,705 టికెట్లు రద్దు కాగా, రూ.570 కోట్లు ప్రయా ణికులకు అందిన ట్లు తాజాగా తెలిపింది.

అలాగే విమాన సర్వీసుల రద్దు వల్ల ఎయిర్‌పోర్టుల్లో దాదా పు 9,000 బ్యాగ్‌లు, స్యూట్‌కేసులు నిలిచి పోయినట్లు పేర్కొంది. వీటిలో 4,500 బ్యాగులను ఇప్పటికే ప్రయాణికులకు అంద జేసినట్లు వెల్లడించింది.  ఇండిగో సంస్థ సర్వీసుల్లో అంతరాయంపై వివరణ ఇవ్వాల ని ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, 24 గంటల్లో సమాధా నం ఇవ్వాలని ఆదేశాలి చ్చిన సంగతి, డీజీసీఏ ఆ గడువును మరో 24 గంటలు పొడిగించిన సంగతీ విదితమే.

తాజాగా మరో పరిణామం చోటుచేసుకు న్నది. సర్వీసుల అంతరాయ సమస్య తీవ్రత రమ వుతుండడంతో డీజీసీఏ నియ మించి న నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసు కుంది. సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ తోపాటు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఇసిడ్రే పోర్క్వెరాస్‌కు సమన్లు జారీ చేసింది. దీంతో వారిద్దరూ బుధవారం విచారణ కమిటీ ఎదుట హాజరయ్యే అవకాశం కనిపిస్తున్నది. 

తేలిగ్గా తీసుకోవడం లేదు: కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

ఇండిగో సంక్షోభంపై పార్లమెంట్‌లోనూ దుమారం రేగింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ అంశంపై రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. అందుకు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానమిస్తూ.. ఇండిగో విమాన సర్వీసుల రద్దు, అంతరాయ సమస్యలను తేలిగ్గా తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

రాజ్యసభ వేదికగా ఆయన ప్రసంగిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేశా మని వివరించారు. ఇండిగో సంస్థ పరిధిలో సిబ్బంది కొరత, ప్రణాళిక లోపం వల్లే సమస్యలు తలెత్తాయని స్పష్టం చేశారు. పరిష్కా రానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

‘ఎయిర్ ఇండియా’ఎకనమీ క్లాస్ టికెట్ ధరలపై పరిమితి

‘ఇండిగో’ విమాన సర్వీసుల సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన టిక్కెట ధరల పరిమితిని తాజాగా ‘ఎయిర్‌ఇండియా’ విమానయాన సంస్థ అమలు లోకి తీసుకొచ్చింది. దీనిపై తాజాగా ఆ సంస్థ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసింది. ‘ఈ నెల 6న పౌర విమానయాన మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మా సంస్థ ఎకనమీ క్లాస్ టికెట్ల ధరలను అమలు చేస్తున్నాం. కొత్త ధరలు అమలులోకి తీసుకొచ్చాం. ఈ మార్పులు జరుగుతున్న సమయంలో ఎవరైనా ఎక్కువ ధరకు టికెట్ బుక్ చేసుకొంటే.. ఆ మొత్తాన్ని సంస్థ రిఫండ్ చేస్తుంది’ అని పేర్కొంది.

మూడు విమానాలకు బాంబ్ బెదిరింపులు

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే మూడు విమానాలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. కేరళలోని కన్నూర్ నుంచి హైదరాబాద్ వచ్చే ఇండిగో ఎయిర్ లైన్స్, ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్ వచ్చే లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్, లండన్- నుంచి హైదరాబాద్ వచ్చే బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి.

అప్రమత్తమైన శంషాబాద్ విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానాలు జాగ్రత్తగా ల్యాండ్ అయ్యేలా చూశారు. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపారు. అనంతరం ఐసోలేషన్‌కు తరలించారు. బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టి బెదిరింపు కాల్స్ ఫేక్ అని తేల్చారు.