calender_icon.png 19 December, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి

18-12-2025 12:00:00 AM

నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ

చిన్నశంకరంపేట (మెదక్), డిసెంబర్ 17 : చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ నాయకులు, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజన్నగారి సంజీవరెడ్డి గుండెపోటు రావడంతో అస్పత్రిలో చేర్పించగా మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బుధవారం జంగారాయి గ్రామానికి చేరుకొని సంజీవరెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు.  అనంతరం అంతక్రియల్లో పాల్గొన్నారు. వీరి వెంట పిఎసిఎస్ చైర్మన్ అంజి రెడ్డి, మాజీ జడ్పిటిసి మాధవి రాజు, మాజీ సర్పంచులు కుమార్ గౌడ్, మంచాల లక్ష్మణ్, దయానంద్ యాదవ్, అయ్యోరి లక్ష్మణ్, మహిపాల్ రెడ్డి, జ్యోతి ప్రభాకర్, లింగారెడ్డి, మండల నాయకులు రామ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, బాగారెడ్డి, బందెల సుధాకర్, ఇమ్మడి నరేష్ తదితరులు ఉన్నారు.