3 April, 2026 | 3:10 AM

బ్రైడ్ సాంగ్..

03-04-2026 12:00 AM

తరుణ్ భాస్కర్ హీరోగా రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంథిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేశ్ బన్సాల్ నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘బ్రైడ్ సాంగ్’ను విడుదల చేశారు. ఈ గీతాన్ని ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ మూడ్‌ను ఫ్రెష్‌గా, ఫన్‌తో నింపేలా రూపొందించారు. మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: విద్యాసాగర్ చింత; సంగీతం: స్వీకర్ అగస్తీ; ఎడిటర్: విప్లవ్ నిషాదం; ప్రొడక్షన్ డిజైన్: చంద్రిక గొర్రెపాటి.