calender_icon.png 7 January, 2026 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలి

05-01-2026 12:36:41 AM

  1. 11న సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రజాప్రతినిధులుతో సమావేశం

మాజీమంత్రి, అసెంబ్లీ లో డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): ఈ నెల 11 వ తేదీన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతి నిధులు, నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు మాజీమంత్రి,అసెంబ్లీ లో డిప్యూ టీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 17 వ తేదీన  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 10 వేల మందితో భారీ ర్యాలీగా బయలుదేరి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదు గా ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్ర హం వరకు ర్యాలీ చేరుకుంటుందని వివరించారు. భారీ ర్యాలీని విజయవంతం చేసేందు కు తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై 11న నిర్వహించే సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, మేధావులు, విద్యావంతులు, కాలనీలు, బస్తీల కమిటీలు, వ్యాపార వాణిజ్య సంఘా లు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత అస్థిత్వాన్ని దెబ్బతీస్తామంటే చూస్తూ సహించబోమని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. డీ లిమిటేషన్ లో భాగంగా 150 డివిజన్ లు ఉన్న జీహెచ్‌ఎంసీ లో ఔటర్ రింగ్ రోడ్ లోపల గల 20 మున్సిపాలిటీ లు, 7 కార్పొరేషన్ లను ప్రభుత్వం విలీనం చేసి 300 డివిజన్ లకు పెంచారని పేర్కొన్నారు.

300 డివిజన్‌లతో మూడు కార్పొరేషన్‌ల ను ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వం ఏర్పాట్లు చేస్తుందని, జంట నగరాలు అంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలు ప్రసిద్ది పొందాయని పేర్కొన్నారు. ప్రజాస్వా మ్య ప్రభుత్వంలో ఉన్నామనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరిచి రాచరిక పాలనలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని విమర్శించారు.

ఈ సమావేశంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, రాంగోపాల్ పేట డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్,మోండా డివిజన్ కు చెందిన నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్ తదితరులు ఉన్నారు..