calender_icon.png 15 September, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సేవను ప్రజలకు తెలియజేయాలి

15-09-2025 01:19:59 AM

హైదరాబాద్ జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ జే.వెంకటి

ముషీరాబాద్, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను ప్రజలకు తెలియజేయాలని హైదరాబాద్ జిల్లా డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ జె. వెంకటి అన్నారు. ఈ మేరకు ఆదివారం ముషీరాబాద్‌లో తెలంగాణ యునైటె డ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ 5వ మహాసభ సిఐటియు ఆఫీసులో జరిగింది. ఈ సందర్భంగా ‘ప్రజా ఆరోగ్యం- ఉద్యోగులు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.

ఈ సెమినార్ కు హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె. వెంకటి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ప్రారంభంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజలను అనేక కమ్యూనికేబుల్ డిసీజెస్ నుండి ఉద్యోగులు రక్షించే వారన్నారు.

అనంతరం యూనియన్ మహా సభ జరిగింది. జిల్లా మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది నూతన జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి.కిరణ్మై , జిల్లా అధ్యక్షులుగా జే.కుమారస్వామి కోశాధికారిగా పద్మ నగర ఉపాధ్యక్షులుగా మమత, రమ, వాణి, విజయలక్ష్మి, నరేష్ చారి, జాయింట్ సెక్రటరీలుగా సులోచన, బాలమణి, షీలా, కోశాధికారిగా పద్మ కమిటీ సభ్యులు గా లక్ష్మీ, సరిత, జయలక్ష్మి, సువర్ణగ్రస్, స్రవంతి, యశోద, సునీత, సరోజ, నాగలక్ష్మి, రమ, సాయిదయ్య, చంద్రకళ, నాగమణి ఎన్నికయ్యారు.