15-09-2025 01:21:27 AM
సీఎం రేవంత్‌కు హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఆహ్వానం
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి విచ్చేయాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఏటా ‘అలయ్ బలయ్’ నిర్వహిస్తున్నందుకు సీఎం ఈ సందర్భంగా దత్తాత్రేయకు కృతజ్ఞతలు తెలిపారు.