15-09-2025 01:19:01 AM
సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీల కమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ మేధో శక్తితో మానవ మనుగడకు ఎన్నో అభివృద్ధి ఫలాలను అందించిన ఘనత ఇంజినీర్లకే దక్కుతుందన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా సీఎం వారికి శుభాకాంక్షలు తెలియ జేశారు. దేశ ఆర్థికాభివృద్ధి, ప్రగతికి బలమై న పునాదులు నిర్మించిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినమైన సెప్టెం బర్ 15ను పురస్కరించుకొని, ఆయన జ్ఞాపకార్థం ఇంజనీర్స్ డే గా జరుపుకోవడం జరు గుతుందన్నారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీరుగా, దార్శనికుడిగా, విద్యాప్రధాతగా, నిపుణుడిగా, పారిశ్రామిక ప్రగతి చోద కుడిగా ప్రత్యేకతను చాటారన్నారు. మూసీ వరదల నుంచి హైదరాబాదు నగరాన్ని రక్షి ంచేందుకు జల నియంత్రణ ప్రణాళికలు, ఎ న్నో గొప్ప నిర్మాణాలు చేపట్టటంలో ప్రత్యేక చొరవ చూపించారని గుర్తు చేశారు. ఈ సం దర్భంగా రాష్ర్ట, ఇంజనీరింగ్ విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు అంద రూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకుని, రాష్ర్ట అభివృద్ధిలో ఇంజనీర్స్ త మ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.