21 March, 2026 | 8:38 AM

ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి

21-03-2026 12:42 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం

కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం  రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డితో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మభ్యపెడుతోందని ముఖ్యంగా రైతు భరోసా నిధులు విడుదల చేయడం,

పంటల బీమా పథకం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని, రైతుల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రాబోయే వానాకాలం సీజన్ నుంచి అయినా  పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విశాల్, సుజిత్, ఆంజనేయులు గౌడ్, శంకరయ్య  తదితరులు పాల్గొన్నారు.