21 March, 2026 | 1:44 PM

Breaking News

ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం   •   జీవన్ రెడ్డికి బుజ్జగింపులు.. తన నిర్ణయంలో మార్పులేదన్న సీనియర్ నేత   •   తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •  

వసతి గృహాలకు గ్యాస్ సరఫరా పకడ్బందీగా సాగాలి

21-03-2026 12:44 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, మార్చి 20 (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలకు గ్యాస్ సిలిండ ర్ల సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా కొనసాగాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో అందుబాటులో ఉన్న గ్యాస్ సిలిండర్ల స్టాక్ వివరాలను కలెక్టర్ సమీక్షించారు.

గ్యాస్ ఏజెన్సీలు వసతి గృహాల అవసరాలకు అనుగుణంగా సమయానికి సరఫరా చేయాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అదన పు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, డీఈఓ భోజన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల అధికారులు దయానంద్, అంబాజీ, శ్రీనివాస్, మోహన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.