calender_icon.png 23 January, 2026 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవుల స్మగ్లింగ్ సంపూర్ణంగా నిషేధించాలి

23-01-2026 12:26:22 AM

అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్

ముషీరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): భారతదేశాన్ని సంపూర్ణ హిందూ రాష్ట్రంగా నిర్మించాలనే లక్ష్యంతో, గోవధం, గోవుల అక్రమ రవాణా స్మగ్లింగ్ పై సంపూర్ణ నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఆలయాలు, మందిరాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ ప్రార్ధన యాత్ర జనవరి 10న ప్రారంభమైందని, ఈ యాత్ర ఫిబ్రవరి 15న మథురాలో ముగుస్తుందని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షురాలు రాజశ్రీ చౌధరి వెల్లడించారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

గోమాత భారతీ య ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి, సేంద్రి య వ్యవసాయానికి, పునరుత్పాదక శక్తికి మూలాధారం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహాసభ తెలంగాణ అధ్యక్షులు గడ్డమీది కళ్యాణ్ గౌడ్, ఏపీ అధ్యక్షులు జి. మల్లికార్జున, నాయకులు అజయ్ కుమార్, నవీన్ కుమార్, శ్రీనివాస చారి, స్వామి, బీసీ సంఘం నేతలు జి. అనూరాధ, గంగాపురం పద్మ తదితరులు పాల్గొన్నారు.