calender_icon.png 23 January, 2026 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల పర్యటనతో వ్యాపారుల్లో హడల్

23-01-2026 12:25:18 AM

నాగర్ కర్నూల్ జనవరి 22 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో బంగారం, బట్టలు, ఎలక్ట్రికల్ స్టోర్, కిరాణా వర్తక వ్యాపార దుకాణదారులు హడలెత్తిపోయారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆయా దుకాణాల్లో సేల్స్ టాక్స్, లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు ఆకస్మికంగా తనికీలు చేపట్టారు. భోజనానికి సైతం క్షణం తీరిక లేని వ్యాపారులు అధికారుల పర్యటనతో దుకాణాలకు తాళాలు వేసి పరారు కావడంతో చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో మోసాలకు పాల్పడుతున్న వారే భయపడతారని అన్ని దుకాణాలు ఒకేసారి తాళాలు వేసి లాక్ డౌన్ మాధురి బందు పాటించడం విశేషం.  ముఖ్యంగా అత్యధిక మోసాలకు పాల్పడే బంగారం దుకాణదారులు రాజకీయ పలుకుబడితో తమ దుకాణాల్లో దాడులు జరగకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

మరో పక్కా అధికారులు సైతం తమ చేతి వాటం ప్రదర్శించినట్లు చర్చ జరుగుతోంది. ఎల్సీడి, స్మార్ట్ ఫోన్లు సీజ్ చేసినట్లు సమాచారం. పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా తయారీ దారులపై 19 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా క్రయ విక్రయాలు స్తంభించిపోయాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ తనికెల్లో నల్గొండ జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ అధికారి కే.సిద్ధార్థ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ పి నాగేశ్వర్ రావు, భువనగిరి లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ కె వెంకటేశ్వర్లు, వనపర్తి జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ జి రవీందర్, మహబూబ్నగర్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ పి.రవీందర్ పాల్గొన్నారు.