calender_icon.png 23 January, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలంపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్

23-01-2026 12:26:25 AM

కాంగ్రెస్ ను వీడి బిఆర్‌ఎస్ లో పలువురు చేరిక 

అలంపూర్ జనవరి 22: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్ పట్టణ కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన అలంపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ యువ నేత ఆసిఫ్ ఖాన్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఈ మేరకు గురువారం కర్నూల్ పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలోని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు వారు మర్యాదపూర్వకంగా కలిసి వారి సమక్షంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు.

ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు.అనంతరం ఇరువురు మాట్లాడుతూ... రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, వెంకట్రామయ్య శెట్టి, నారాయణరెడ్డి, కిషోర్, పట్టణ యువత తదితరులు పాల్గొన్నారు.