calender_icon.png 18 December, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య హత్య

18-12-2025 12:50:29 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి):  పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం రా జ్యాంగ , ప్రజాస్వామ్య హత్య అని రాంచందర్ రావు తెలిపారు. స్పీకర్ తీసుకున్న నిర్ణ యం రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా ఉం దన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని పదే పదే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు రాజ్యాంగ వ్యవస్థ అయిన స్పీకర్‌ను కూడా ప్రభావితం చేసి నిర్ణయం తీసుకోకుండా చేసిందన్నారు.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, అలాంటి పార్టీనే ఈ రోజు ఆ చట్టానికి, రాజ్యాంగానికి గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తోదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజ్యాం గానికి కట్టుబడి ఉండాల్సిన స్పీకర్‌పై ప్రభా వం చూపి ఈ తరహా నిర్ణయం తీసుకునేలా చేశారని కాంగ్రెస్‌ను  విమర్శించారు.