18-12-2025 12:49:31 AM
ఏసీబీ కోర్టు అనుమతులు
హైదరాబాద్, డిసెంబర్ 17(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. రూ.10 వేల పూచికత్తుతో పాస్‌పోర్టు ఇచ్చేందుకు అనుమతించింది. అయితే మార్చి 3 లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్ జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ పర్యటనకు ఏసీబీ స్పెషల్ కోర్టు అనుమతి ఇచ్చింది.
2015లో ఓటుకు నోటు కేసులో బెయిల్ షరతుల మేరకు కోర్టు అనుమతిని సీఎం రేవంత్‌రెడ్డి పాస్‌పోర్టు కోర్టు కస్టడీలో ఉంది. కాగా రేవంత్‌రెడ్డి విదేశాల్లో పర్యటించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే రూ.10వేల పూచికత్తుతో పాస్‌పోర్టు ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. దావోస్ సదస్సులో తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు మఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి ప్రతినిధి బృందంతో కలిసివెళ్తారు.