18-12-2025 12:51:02 AM
క్రిస్మస్ వేడుకల్లో సంపంగి గ్రూప్స్ చైర్మన్ రమేష్ సంపంగి
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): ప్రపంచానికి ప్రేమ, త్యాగం నేర్పిన క్రీస్తును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జూబ్లీహిల్స్ సంపంగి గ్రూప్స్ కార్యాల యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో చైర్మన్ రమేష్ సంపంగి, సీఈవో సురేష్ సంపంగి అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు బ హుమతులు, చాక్లెట్లు పంచి వేడుకలు నిర్వహించారు.
తాము చేస్తున్న పనిలో పారదర్శకత, నిజాయతీ ఉంటే పరమాత్ముడి తత్వా న్ని అన్వయించుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుంది అని అన్నారు. సంపంగి గ్రూప్స్‌లో పనిచేసే ప్రతి ఉద్యోగితో కలిసి కుల మత భేదం లేకుండా ప్రతి పండుగను ప్రతీ సంవత్సరం అత్యంత వైభవంగా చేసుకోవడం సంతోషంగా ఉంది అని అన్నారు. వ్యాపారం ఒక్కటే కాకుండా సంపంగి గ్రూప్స్ ఎన్నో సేవా కార్యక్రమాల ను నిర్వహిస్తుందన్నారు.