మా ఇంటి బంగారం దూకుడు
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీరెడ్డి దర్శకత్వం వహించారు. జూన్ 19న విడుదలవుతున్న ఈ మూవీ మన తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ మార్కెట్లలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ-సేల్స్‌లో $300K దాటేయటం విశేషం. టికెట్ బుకింగ్స్ కూడా వేగంగా కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా యూఎస్‌లో సమంతకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా అక్కడ టికెట్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. డైరెక్టర్ నందినీరెడ్డితో ఆమెకున్న సక్సెస్‌ఫుల్ కాంబో క్రేజ్ కూడా ఈ సినిమాకు మరింత బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం ఉన్న బజ్, అడ్వాన్స్ బుకిం గ్స్‌ను దృష్టిలో పెట్టుకుని చూస్తే.. ఈ సినిమా ఓవర్సీస్‌లో ప్రతిష్టాత్మకమైన $1 మిలియన్ క్లబ్‌లో చేరే అవకాశాలున్నా యని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇక్కడ కూడా ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది.
దీంతో సమంత కెరీర్‌లోనే ఈ చిత్రం బెస్ట్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సరసమైన టికెట్ ధరలు కూడా డిమాండ్‌ను మరింత పెంచాయి. దీంతో ఓపెనింగ్ వీకెండ్‌లో సినిమా చూసే కుటుంబ ప్రేక్షకులకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారింది. యాక్షన్‌తోపాటు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కలగలిసిన సినిమా కావటమే అతి పెద్ద బలంగా మారింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సమంత పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని మార్కెట్లలో కూడా బలంగా కొనసాగుతున్నాయి.






