calender_icon.png 1 October, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్తాబవుతున్న రావణాసుర విగ్రహం

01-10-2025 06:29:06 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): ప్రతి ఏటా తెలంగాణ ప్రజల భారీ ఉత్సవమైన దసరా పండుగ కోసం నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో రావణ సుర విగ్రహం ముస్తాబవుతోంది. గురువారం జరగబోవు ఈ ఉత్సవానికి హిందూ ఉత్సవ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రావణాసుర భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులు బుకా వెంకటేశ్వర్లు, చింతామణి కృష్ణ, పడాల రాజశేఖర్, మానాల శంకర్, శ్యాం పర్యవేక్షిస్తున్నారు.