01-10-2025 06:27:23 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో బుధవారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర గ్రామ వికాస్ సంయోజక సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం సంయోజక మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా దేశంలో పంచ పరివర్తన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ పంచ పరివర్తనలో భాగంగా చెట్లు నాటడం, ఒకసారి వాడే ప్లాస్టిక్ ను నిషేధించడం, భూగర్భ జలాలను పెంపొందించడం, స్వాఆధారిత కార్యక్రమాలు, స్వభాష, స్వ వేషం, స్వయం సంస్కృతితో పాటు విదేశీ వస్తువులను బహిష్కరించడం, స్వదేశీ వస్తువులను ఉపయోగించడం, ఈ 5 పంచ పరివర్తన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. హిందూ కుటుంబాలు సమిష్టిగా ఉండేలా హిందువుల మానసిక స్థితిని పెంపొందించడానికి పండుగలు పర్వదినాలలో సమిష్టి కుటుంబాలోని వారందరూ కలుసుకునే సంప్రదాయాన్ని పాటించాలి అన్నారు.
పూర్వకాలం నుండి హిందుత్వంలో జ్ఞానాని కే ప్రథమ ప్రాధాన్యం ఉన్నదే తప్ప కులమతాలు, వర్గా విభేదాలకు తావు లేదని మళ్లీ పూర్వ సమాజాన్ని పునర్మించాలని అన్నారు. కుల మతాలను పాటించకుండా అందరిలో దైవమున్నాడ ని భావించే సామరస్యత కోసం కృషి చేయాలని అన్నారు. పౌర విధులను సక్రమంగా నిర్వహించాలని రాజ్యాంగం చట్టాలను పాటించడం ద్వారా సమాజంలో పౌర భావనను పెంపొందించడం ద్వారా భారతదేశాన్ని మరో పదేళ్లలో ప్రపంచంలోని అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తుందని అన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రజలకు ఆర్ఎస్ఎస్ తో పరిచయం చేయడానికి ప్రతి మండలంలో వివిధ రూపాలలో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ గడ్డం శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దేవరావు, ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ వందమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.