calender_icon.png 25 June, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంపుకొడుతున్న ఖమ్మం దవాఖాన?

25-06-2025 01:27:17 AM

- బారులు తీరుతున్న రోగులు

- అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విధుల బహిష్కరణ

- చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు

ఖమ్మం, జూన్ 24 ( విజయ క్రాంతి): ఒక పక్క సీజనల్ వ్యాధుల సమయం.... రో జు రోజుకి పెరుగుతున్న పేషెంట్ లు....మరో పక్క జీతాలు రాక పోవడంతో కొద్ది రోజులుగా విధులు బహిష్కరించి నిరసన తెలుపు తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు... దింతో ఎక్కడ చెత్త అక్కడే ఉండడము.... బాత్రూంల క్లీనింగ్ సరిగ్గా లేక ఖమ్మం ప్రభుత్వ అస్పత్రి కంపు కొడుతోంది.... వివరాల్లోకి వెళ్తే ఖ మ్మం ప్రభుత్వ అస్పత్రి కి వచ్చే పేషెంట్ ల సంఖ్య రోజు రోజు కు పెరుగుతుంది. మంగళవారం పేషెంట్ పేరు నమోదు చేసుకొనే ప్రదేశంలో తమ పేరు నమోదు చేసుకునేందుకు వందల మంది బారులు తీరారు. ఎ క్కువ మంది జ్వరం ఇతరత్ర సమస్యలతో చూపించు కోనేందుకు దూరప్రాంతల నుండి వచ్చారు. 

అవుట్ సోర్సింగ్ కార్మికుల విధులు బహిష్కరణ

అస్పత్రిలోని వివిధ విభాగల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ (సానిటరీ, పేషెంట్ హె ల్పేర్, సెక్యూరిటీ తదితర) కార్మికులకు గత 4 నెలలుగా జీతాలు రాక పోవడముతో వా రు గత కొద్ది రోజులుగా విధులు బహిష్కరిస్తున్నారు. చేసిన పనికి జీతాలు ఇవ్వక పోవ డము దారుణము అని వివిధ సంఘాల వారు వారికి మద్దతు తెలుపుతున్నారు.

మున్సిపాలిటీ వారితో క్లీనింగ్ 

అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించాటముతో అధికారులు మున్సిపల్ సానిటరీ వర్కర్ లతో క్లీనింగ్ చేపిస్తు న్నారు. తమకు జీతాలు ఇవ్వక పోవటము తో మేము విధులకు రావటము లేదని, వేరే వాళ్ళతో క్లీనింగ్ ఎలా చేపిస్తారని వారిని అ స్పత్రి అవుట్ సోర్సింగ్ కార్మికులు అడ్డుకొంటున్నారు.దింతో అస్పత్రి లో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తుంది, బాత్ రూమ్ లు సరి గ్గా క్లీనింగ్ చేయకపోవడముతో చుట్టుపక్కల వారు ముక్కు లు మూసుకుని ఉండాల్సి వస్తుంది.

సమస్య పరిష్కరించాలి

గోంతెమ్మ కోరికలు కోరటము లేదని, ప ని చేసిన దానికి జీతం ఇవ్వమంటున్నామని, ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలుగజేసుకొని తమ జీతాలు తమకు ఇ ప్పించాలని కార్మికులు కోరుతున్నారు.

నేడు మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి

తమ పెండింగ్ జీతాలు తమకు ఇవ్వాలని నేడు మంత్రి తుమ్మల నాగేశ్వరావు క్యాంపు కార్యాలయం ముట్టడి చేయనున్న ట్టు కార్మికులు, కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు.