calender_icon.png 10 September, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కథలే మొదలే..

10-09-2025 12:00:00 AM

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘కే జైన్స్ నాని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. ఇందులో యుక్తి తరేజా కథానాయిక కాగా.. నరేశ్, సాయికుమార్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం మంగళవారం ఈ సినిమా నుంచి ‘కలలే కలలే’ అనే ఓ ప్రేమగీతాన్ని విడుదల చేసింది. చైతన్య భరద్వాజ్ స్వరపర్చిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, కపిల్ కపిలన్ పాడారు. ‘కలలే కలలే.. కనులకు నువు కనబడి.. కలలే కథలే మొదలే.. వివరములే తెలియాలే..’ అంటూ సాగుతుందీ గీతం. ఈ చిత్రానికి డీవోపీ: సతీశ్‌రెడ్డి మాసం; యాక్షన్: పృథ్వీ; ఎడిటర్: ఛోటా కే ప్రసాద్; ఆర్ట్: బ్రహ్మ కడలి.