calender_icon.png 10 September, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంబరాల ఏటిగట్టు యాక్షన్

10-09-2025 12:00:00 AM

సాయిదుర్గతేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు. రూ.125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ పాన్‌ఇండియా ప్రాజెక్టు సాయిదుర్గతేజ్ కెరీర్‌లో అతిపెద్దది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక షూటింగ్ షెడ్యూల్ సెప్టెంబర్ నెల మధ్యలో ప్రారంభం కానుంది. ఈ షూటింగ్ అప్‌డేట్‌ను చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా పంచుకుంది. ఈ షెడ్యూల్‌లో పీటర్ హెయిన్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఇందులో శక్తిమంతమైన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ సూపర్ స్టార్‌తో కథానాయకుడు సాయిదుర్గతేజ్ తలపడతారు.

ఈ ప్రాజెక్టు కోసం సాయిదుర్గతేజ్ రెండేళ్లుగా ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో ఐశ్వర్యలక్ష్మి, జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: వెట్రి పళనిసామి; సంగీతం: బీ అజనీష్ లోక్‌నాథ్; ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్; ఎడిటర్: నవీన్ విజయకృష్ణ.