9 July, 2026 | 9:14 AM

2025లో పెళ్లి చేసుకుంటా

17-12-2024 12:00 AM

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ అమృత అయ్యర్. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకున్నా కూడా ఆ తరువాత చేసిన ‘హనుమాన్’ మాత్రం మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ‘బచ్చల మల్లి’ సినిమా అవకాశం అమృతకు వచ్చింది. ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించారు. ప్రస్తుతం ‘బచ్చల మల్లి’ ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమృత అయ్యర్‌కి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో వరుస వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో ‘మీ పెళ్లప్పుడు?’ అని ఓ విలేకరి అమృతను ప్రశ్నించారు. ఇప్పుడు తాను వివాహం చేసుకునేందుకు సిద్ధమేనని ఆమె చెప్పారు. “2025లో కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. అయితే ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని మాత్రం పెళ్లి చేసుకోను. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఏ గొడ వా ఉండదు. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ అయితే లేనిపోని సమస్యలొస్తాయి. ఇండస్ట్రీ కాని వ్యక్తిని వివాహం చేసుకుంటే మా ట్లాడుకోవడానికి కూడా చా లా విషయాలుంటాయి” అని అమృత అయ్య ర్ చెప్పుకొచ్చారు.