24-04-2025 12:59:57 AM
నస్పూర్(మంచిర్యాల), ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : జమ్మూకశ్మిర్ లోని పాహెల్ గాంలో ఉగ్ర దాడి వెనుక పాక్ లాస్కరే సంస్థ హస్తం ఉన్నదని, ఆ దాడిలో చనిపోయిన వారికి మాజీ సర్పంచ్ మల్లెతుల రాజేంద్రపాణి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు.
ఉగ్రవాదుల దాడి దేశద్రోహుల చర్య అని, పాకిస్తాన్ పిరికి పందల చర్యగా ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువ-కులు సందనవేణి శ్రవణ్, రాజు, క్రాంతి, అఖిల్, శ్రీనివాస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.