calender_icon.png 23 May, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కశ్మీరీల బాధ వర్ణనాతీతం: నవాజుద్దీన్ సిద్ధిఖీ

30-04-2025 12:00:00 AM

పహల్గాం ఘటనపై అందరికంటే ఎక్కువగా కశ్మీర్‌వాసులే బాధపడుతున్నారు. ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పారు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. పర్యాటకులపై ఉగ్రదాడి ఘటనను ఉద్దేశించి నవాజుద్దీన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. “నాకు బాధే కాదు చాలా కోపంగానూ ఉంది. ఈ విషయంలో బాధితులకు ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని నమ్ముతున్నా.

ఆ ఘటన నిజంగా బాధాకరం, సిగ్గుచేటు. ఈ ఘటన కశ్మీర్ పర్యాటకులపై బాగా ప్రభావం చూపింది. సందర్శకులను అక్కడి ప్రజలు స్వాగతించే తీరు డబ్బుకు మించినది. వాళ్లలో నేను ప్రేమను చూశాను. సందర్శకులు తిరుగు ప్రయాణంలో స్థానికులపై ప్రశంసలు కురిపిస్తారు. ఆ ప్రశంసలకు వారు నిజమైన అర్హులు. ఈ ఘటన తర్వాత వాళ్లంతా కలత చెందారు. దీన్ని దేశమంతా ఖండించింది. అదే మన ఐక్యతకు ఉదాహరణ” అని సిద్ధిఖీ తెలిపారు.