calender_icon.png 17 May, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైకో కిల్లర్‌ను వేటాడే పోలీస్

30-04-2025 12:00:00 AM

నవీన్‌చంద్ర హీరోగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. ఈ చిత్రాన్ని లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం లో ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్‌ఖా న్, రేయాహరి నిర్మిస్తున్నారు. రేయా హరి కథానాయికగా నటించగా, అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నటుడు కమల్‌హాసన్ మంగళవారం విడుదల చేశారు.

‘లాస్ట్ ఇయర్ వైజాగ్‌లో వరుసగా ఎనిమిది హత్యలు జరిగాయి. సీరియల్ కిల్లింగ్స్’ అనే ఇంటెన్స్ డైలాగ్‌తో పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్‌గా నవీన్‌చంద్ర ఆ కేసును పరిశోధించిన తీరు ఆకట్టుకుంది. ‘సైకో కిల్లర్ విత్ అన్‌బిలివబుల్ ఐక్యూ’ అనే డైలాగ్ సైకో కిల్లర్ క్యారెక్టర్ చుట్టూ సస్పెన్‌ను మరింతగా పెంచింది. ఈ చిత్రం మే 16న విడుదల కానుంది. కాగా ఈ సినిమాను ఎన్ సుధాకర్‌రెడ్డి రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదల చేయనున్నారు.