03-07-2025 02:04:55 AM
రాజన్న దర్శనం అవుతుంది కానీ గత ఎమ్మెల్యే మాత్రం అసలు దొరకడు
వేములవాడ టౌన్ జూలై 2 (విజయక్రాంతి): పలు వార్డుల్లో 4కోట్ల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని భవాని నగర్ 24వ వార్డులో 11 లక్షలతో సిసి రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
పలు వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు స్థానిక ప్రజలు మాజీ కౌన్సిలర్ ఉమా రాణి శ్రీనివాస్ లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 24వ వార్డులో 20 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం అదృష్టం అన్నారు. వేములవాడ గుడిలో రాజన్న దర్శనం అయిన అవుతుంది కానీ గత ఎమ్మెల్యే దర్శనం భాగ్యం కలగకపోయేదని వాపోయారు. వార్డులోని పలు సమస్యలు సైతం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.