27 March, 2026 | 12:58 PM

ఉక్కపోతకు ఉపశమనం

04-05-2024 01:42 AM

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రతిరోజూ 45 డిగ్రీల సెంటిగ్రేడుపైనే నమోదవుతున్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో ఉష్ణోగ్రత గరిష్ఠంగా 46.3 డిగ్రీలకు చేరింది. ఉదయం నుంచే ఉక్కపోతగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఫ్యాన్లు ఉన్నప్పటికీ వాటి నుంచీ వేడిగాలుల వస్తుండటంతో తిప్పలు తప్పట్లేదు. మంచిర్యాలలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఎండలకు తాళలేక చల్ల గాలి, నీటి కోసం కూలర్లు, ఫ్యాన్లు, కూల్ వాటర్ టిన్‌లను ప్రజలే ఏర్పాటు చేసుకుంటున్నారు. గర్భిణులు, బాలింతలు,చిన్న పిల్లలకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం వీటిని సమకూర్చుకుంటున్నారు.  మే 3 (విజయక్రాంతి)