దేవరుప్పుల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నాగరాజు
27-08-2026 01:16 AM
దేవరుప్పుల (జనగామ)ఆగస్టు 26,(విజయ క్రాంతి): దేవరుప్పుల మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఇనుముల నాగరాజును ఎన్నుకున్నట్లు జనగామ డీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ వేముల మల్లేశం బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మండలంలో ఎస్సీల సమస్యల పరిష్కారానికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.






