ఆలోచింపజేసిన సత్యాన్వేషి నాటకం
ముషీరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాం తి): సిద్ధార్ధుడు గౌతమ బుద్ధుడిగా మారడానికి ముందు అతడి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ’సత్యాన్వేషి’ నాటకం ఆహూతులను మెప్పించింది. బుధవారం రవీంద్రభారతిలో చిలువేరు రఘురామ్ రచించిన ఈ ’సత్యాన్వేషి’ తొలి నాటకం కళావిపంచి నరసింహా రావు ఆధ్వర్యంలో డా. వెంకట్ గోవాడ దర్శకత్వంలో ప్రదర్శితమైంది. కొత్త కథాంశంతో నాటకాభిమానులకు అందించాలనే సంకల్పంతో 54 మంది కళాకారులతో, 84 పాత్రలతో సత్యాన్వేషి నాటకాన్ని ప్రదర్శించారు.
కపిలవస్తు రాజ్యంలోని సిద్ధార్థుడి బాల్యం నుంచి మొదలై, సమాజంలోని ఘర్షణలు, బాధలు, మరణాలు చూసి చలించిపోవడం, భార్య యశోధర, కుమారుడు రాహుల్ ను ప్రాపంచిక బంధాలను వీడి మానవ జాతి దుఃఖాలకు కారణాలు వెతుక్కుంటూ సత్యం కోసం అన్వేషిస్తూ సత్యాన్వేషి నాటక ప్రయాణం సాగింది. చేశారు. ప్రత్యేక గుర్తింపు పొందిన వెంకట్ గోవాడ దర్శకత్వంలో ప్రదర్శించిన సత్యాన్వేషి నాటకం కొత్తదనంతో వీక్షకులను ఆలోచింపజేసింది.






