27 August, 2026 | 1:28 AM

చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి

27-08-2026 12:11 AM

మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ

ముషీరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాం తి): చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో ఇచ్చిన హా మీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చే యాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అ ధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ డిమాండ్ చేశారు. హామీలు ఇచ్చి మూడేళ్లు దాటినా అ మలు చేయకపోవడం దళితుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  దళిత బంధు స్థానంలో ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం పథకం, రూ.12 లక్షల ఆర్థిక సాయం, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు, మాదిగ, మా ల ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏ ర్పాటు వంటి హామీలను అమలు చేయాల ని కోరారు.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రు ణాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ల పెంపు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం దరఖాస్తుల పరిష్కారం, రాజీవ్ యువ వికాసం అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సునీల్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాదిగ హక్కుల దండోరా జాతీయ సమన్వయకర్త అందేలా భవాని రెడ్డి,  రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మేతరి రోజా రాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ కూ డలి ప్రవీణ్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అ ధ్యక్షులు కొమ్ము కృష్ణ, నాయకులు శనిగర పు సుమన్,  కీసర్ శేఖర్, సుందర రాములు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.