calender_icon.png 13 November, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనం గజగజ

13-11-2025 12:20:07 AM

  1.  సిర్పూర్ యులో 10.2 కనిష్ఠ ఉష్ణోగ్రతలు
  2. రాష్ట్రంలోనే తక్కువగా నమోదు

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్12( విజయక్రాంతి): శీతాకాలం ప్రారంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా చలి ప్రతాపాన్ని చూపెడుతుండగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. జిల్లాలోని సిర్పూర్ యు మండలంలో 10.2 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ఏజెన్సీల్లో నివసిస్తున్న గిరి జనులు గజగజ వణుకుతున్నారు.  మైదాన ప్రాంతంలోనూ ఈదురుగాలులతో కూడిన చలి ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.