3 July, 2026 | 11:11 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి

07-05-2024 12:05 AM

బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి నిరుద్యోగులను నమ్మించి సుమారు రూ. 40 లక్షలకు పైగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన దరిమిలా యువత అప్రమత్తంగా వుండవలసిన అవసరం ఎంతైనా ఉంది. చదువు పూర్తయ్యాక క్యాంపస్ సెలక్షన్స్ సరిగ్గా జరగక, కొంతమేర ఇంటర్వ్యూలు జరిగినా ఎక్కువ మందికి ఉద్యోగాలు రాకపోవడం వల్ల చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవడం సహజం. అందరూ టాప్ పర్సంటేజీతో పాస్ కాలేరు కదా. ఎక్కువ కంపెనీలు మెరిట్ స్టూడెంట్స్‌నే ఎంపిక చేసుకుంటుంటాయి. నిరుద్యోగులు కాలేజీ నుంచి బయటకు వచ్చాక ఆఫ్ క్యాంపస్‌లో ఉద్యోగాలు వెతుక్కోవలసివస్తున్నది. 

 కె.రాజేందర్, మేడ్చల్