ఉచిత లగేజీ ఇంత తక్కువా?
07-05-2024 12:05 AM
విమానం అంటేనే డబ్బుకు ప్రాధాన్యమని పని కట్టుకొని చెప్పక్కర్లేదు. దీనికి నిదర్శనంగా ‘ఎయిర్ ఇండియా’ విమానయాన సంస్థ తాజాగా బ్యాగేజీ బరువులను తగ్గించడం దురదృష్టకరం. టికెట్ విధానాన్ని బట్టి ఉచిత లగేజీ బరువులో వెసులుబాటు సౌకర్యాన్ని కలిగిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఒక ప్యాసింజర్ తనతోపాటు ఉచితంగా 20 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లే అవకాశం ఉండగా, దీనిని 15 కేజీలకు తగ్గించినట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందు ౨౫ కిలోల వరకు వున్న అవకాశాన్ని ఏడాది కిందటే 20 కిలోలకు తగ్గించింది. ఈ సంస్థ ‘టాటా’ గ్రూప్ చేతికి వచ్చిన తర్వాత ఈ మార్పు చేయడం గమనించదగ్గ విషయం.
బి.విభవ్, హైటెక్ సిటీ, హైదరాబాద్






