calender_icon.png 27 January, 2026 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు

27-01-2026 12:00:00 AM

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు అగ్రహం

జడ్చర్ల, జనవరి 26 : అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచి.. అభివృద్ధిని పక్కనపెట్టి కబ్జాలపై మాత్రమే మక్కువ పెంచుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదని బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పై ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరి కాదు తప్పుడు ప్రచారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మానుకోవాలని హితవు పలికిన బిఆర్‌ఎస్ శ్రేణులు అన్నారు.

సోమవారం మార్కెట్ యార్డ్ లోని షెడ్డును ప్రత్యేకంగా పరిశీలించి బిఆర్‌ఎస్ నేతలు మాజీ మార్కెట్ చైర్మన్ పిట్టల మురళి,మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కొడుగల్ యాదయ్య, రామ్మోహన్ లు మాట్లాడారు. 2014 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యేగా డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఉన్న సమయంలో అప్పటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు చేతుల మీదుగా నాలుగు కవర్ షెడ్లు నిర్మాణానికి రూ 2.కోట్ల 75 లక్షల వేల తో శంకుస్థాపన చేసిన శిలాఫలితాన్ని బిఆర్‌ఎస్ నాయకులు పత్రిక ముఖంగా చూపించారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తన కడుపులో ఉన్న విషాన్ని బయటకు పెట్టాడన్నారు. జడ్చర్ల అభివృద్ధి ప్రదాత డాక్టర్ సి లక్ష్మారెడ్డి పై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.

జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని గంగాపురం వద్ద నిర్మించిన కాటన్ మార్కెట్ కు 2004 లో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హయాంలోనే స్థల సేకరణకు దాతలను ఒప్పించి స్ధలం ప్రభుత్వనికి ఇచ్చినట్టు పేర్కొన్నారు. కోట్ల విలువైన పత్తి మార్కెట్ స్థలం ఆనాడు స్థలదాతను ఒప్పించి ఉచితంగా స్థలాన్ని ప్రభుత్వానికి అందజేసిన ఘనత డాక్టర్ సి లక్ష్మారెడ్డి దక్కుతుందన్నారు.

గతంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రం లేకపోతే రైతులు నంద్యాల నుంచి కర్నూల్ పోయి పత్తి విగ్రహాలు చేసిందని లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పట్టణ కేంద్రంలోని పద్మావతి కాలనీ సరస్వతీ నగర్ కాలనీ సిగ్నల్ గడ్డ వెంకటేశ్వర కాలనీ రంగారావు తోట వంటివి కాంగ్రెస్ పార్టీ హయాంలోని ఏర్పడ్డ కాలనీలు అని పేర్కొన్నారు,మరి ఈ కాలనీలు 10% భూములు తనఖా రూపంలో ఎక్కడ కేటాయించలేదని ఎమ్మెల్యే చెబుతున్నారని మరి రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచి అవుతుందని మున్సిపల్ కమిషనర్ ను పిలుచుకొని ఎమ్మెల్యే సమాచారం తెలుసుకోవాలని ఎక్కడ 10% భూముల సమాచారం సేకరించి మాట్లాడాన్నారు.

సర్వేనెంబర్ 443,443/ఆ 449 సర్వే నెంబర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంచర్ ఏర్పాటు చేశారని అది ఎవరు చేశారు తెలుసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల మున్సిపల్ కౌన్సిలర్లపై బిఆర్‌ఎస్ నాయకులు పైకి పదేపదే వ్యాఖ్యాలు చేయడం సరైన పద్ధతి కాదని అవి మానుకోవాలని ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కు సూచించారు. కౌన్సిలర్లు బిఆర్‌ఎస్ నాయకుల అవినీతిపై చర్యలు తీసుకుంటామంటే సిద్దం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.