3 July, 2026 | 11:02 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

మినీ బస్సును ఢీ కొట్టిన వ్యాన్

30-09-2024 12:03 AM

ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు 

వనపర్తి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): వేగంగా వస్తున్న వ్యాన్ అదుపు తప్పి మినీ బస్సును ఢీ కొనడంతో ఒకరు మృతి చెందా రు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున కొత్తకోట జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 12 మం ది కర్నూల్‌లో ఓ శుభకార్యానికి వంటలు చేసేందుకు శనివారం రాత్రి మినీబస్సులో బయలు దేరారు. కొత్తకోట సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలోని ఎడమ టైరు పగిలిపోయింది.

అందులో ఉన్న కొంతమంది కిందకు దిగి టైర్‌ను మార్చుతుండగా హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు వేగంగా వెళ్తున్న వ్యాన్ మినీబస్సును ఢీ కొట్టింది. దీంతో హైదరాబాద్‌లోని చంద్రయాన్ గుట్ట హఫీజ్ బాబా నగర్ కాలనీకి చెందిన సయ్యద్ ముస్తాఫా (33) మృతి చెందాడు. మహమ్మద్ అజీమ్, రవి నాయక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ముస్తాఫాకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.