11 August, 2026 | 3:26 AM

వరుణ యాగం సరే .. రైతులకు గోదావరి నీళ్లు ఇవ్వండి

11-08-2026 12:07 AM

మాజీ బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి, ఆగస్టు 10: ఎలినినో ప్రభావం తో సగటు వర్షం కురవక. చెరువులు కుంట లు నిండకా రైతాంగం పంటలు ఎలా కాపాడుకోవాలి అని బిక్కు బిక్కు మంటుంటే ,వరద పారుతున్న గోదావరి జలాలను ఇవ్వమని అడుగుతుంటే పట్టించుకోని ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వరు ణ యాగం చేయడం విడ్డూరంగా ఉందని మాజీ మండల అధ్యక్షుడు తాటికొండ సీత య్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

 బిఆర్‌ఎస్ నా యకులు వరుణ యాగం అడ్డుకుంటారనే భయం తో ముందస్తు అరెస్ట్ చేయడాన్ని తీ వ్రంగా ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. పో లీసులు ముందస్తు అరెస్ట్ అయిన వారిలో తాటికొండ సీతయ్య మండల అధ్యక్షులు గ్రామానాయకులు బైరోజు దేవేంద్రచారి ,కొల్లూరి లింగయ్య కోరుకొప్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.