బహుజన విముక్తి స్వరం
‘చెప్పులు కుట్టు వాని సేవకు భరతవాని అప్పు పడ్డది సుమీ’ అని పలికిన గుర్రం జాషువా భారతీయ కులవ్యవస్థలోని సామాజిక, ఆర్థిక వైరుధ్యాలను ఆవిష్కరించారు. వేల ఏళ్లుగా సబ్బండ శ్రామిక కులాలు దేశ నిర్మాణానికి వెన్నెముకగా నిలిచినా.. గౌరవం, సమాన హక్కులు, సామాజిక గుర్తింపు మాత్రం వారికి దక్కలేదని జాషువా ఈ వాక్యంతో స్పష్టం చేశారు. శ్రామిక దళిత, బహుజనులకు ఈ దేశం నైతికంగా రుణపడి ఉందనే మహత్తర సామాజిక--, ఆర్థిక తత్వాన్ని అత్యంత సరళంగా, పదునైన భాషలో వ్యక్తీకరించారు.
ఇది నేటికి సమకాలీకమైనది, సార్వజనీనమైనది. గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని చాట్రగ డ్డపాడులో జన్మించారు. దళిత కులంలో పుట్టిన జాషువా బాల్యం నుంచే ఎన్నో అవమానాలు, కుల వివక్షను అనుభవించారు. అందుకే వీటికి వ్యతిరే కంగా తన కవిత్వాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. 1971 జూలై 24న తుదిశ్వాస విడిచిన ఆయన దళిత సాహిత్యానికి పితామహుడైన నవయుగ కవి చక్రవర్తిగా మిగిలిపోయారు.
చారిత్రకంగా మనిషి ఉన్నతికి కులం గీటురాయిగా మారడంతో సాహి త్యం కూడా ధనికుల, అగ్ర వర్ణాలకి వెట్టిచాకిరి చేసింది. సాహిత్య ప్రక్రియలు కొద్దిమంది గీసిన హద్దుల్లో తిరిగాయి. రచనలకు సైతం అంటరానితనమనే లక్షణాలు కమ్ముకున్నాయి. వీటిపై సామాజిక సమరం సాగించిన కవి గుర్రం జాషువా. అగ్రవర్ణ భావ కవిత్వం, అభ్యుదయ, విప్లవ కవిత్వం ఏరులై పారు తున్న క్రమంలో జాషువా దళిత కవిత్వం గొంతుకై వినిపించారు. తనకి ఎదు రైన చేదు అనుభవాన్ని, పీడిత వర్గాల సమస్యలను ప్రతిబింబిస్తూ సాహిత్యాన్ని విశ్వదృష్టికీ పరిచయం చేశారు. భారతీయ కుల వివక్షను జాషువా వర్ణించనట్లు ఏ కవి కూడా వర్ణించలేదు.
ఆయన కవిత్వంలో మానవ హక్కుల పోరాటం కనబడుతుంది. తన సాహిత్యంలో గబ్బిలం, గాడిద, గుర్రం వంటి ఉపమనాలు ఉపయోగించి దళిత జీవన బాధలను చిత్రించారు. మూఢా చారాలు, అసమానత, అంటరానితనంపై సవాళ్లు విసిరారు. దళిత సాహిత్య రచనల లో ప్రముఖమైన గబ్బిలం కావ్యం ద్వారా దళితుడి బాధను, ఆత్మగౌరవాన్ని చిత్రీకరిం చారు. ‘ఫిరదౌసి’, ‘అనాథ’, ‘స్వప్నకథ’ వంటి సామాజిక కవిత్వాలను జాషువా రచిం చారు. ‘అనాథ’ తొలి తెలుగు దళిత మహి ళా కావ్యంగా గుర్తింపు పొందింది. ఈ విధం గా జాషువా కవిత్వం పీడిత వర్గాల హక్కుల పోరాటంగా నిలిచింది.
సమాజంలో వేల ఏళ్లుగా దోపిడీకి గురైన కులాలకు ‘చెప్పులు కుట్టు వాని సేవకు భరతవాని అప్పు పడ్డది సుమీ’ అనే వాక్యం ప్రజా చైతన్య నినాద మైంది. తద్వారా ఏమి ఆశించకుండా చెప్పులు కుట్టే మాదిగలకు అగ్రకుల సమాజం అప్పు పడ్డదని అన్నారు. ఈ వాక్యం తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ విముక్తి ఉద్యమ సారథి డాక్టర్ విశారదన్ మహారాజ్ స్థాపించిన ‘దళిత శక్తి’ ఉద్యమ కరపత్రంలోని తొలి వాక్యమైంది.
అంబేద్కర్ విముక్తి పోరాటం జాషువా కవిత్వంలో కనబడుతుంది. జాషు వా విగ్రహావిష్కరణకు బహుజన రాజ్యాధికార వీరుడు కాన్షీరాం ఆంధ్రప్ర దేశ్‌లోని వినుకొండకు వచ్చారు. అప్పుడే జాషువా ధిక్కార స్వరం ప్రపంచాని కి పరిచయమై, ఆయనకు విశాల గుర్తింపు లభించింది. ఎప్పుడైనా కేవలం ఊహాజనిత కవిత్వం నుంచి విప్లవం రావడం భ్రమ, క్షేత్రస్థాయి ప్రజా విముక్తి పోరాటం నుంచి వచ్చే కవిత్వం విప్లవానికి తోడవుతుంది. జాషువా కవిత్వం కూడా ఆ కోవకే చెందినది.
జాషువా తన గురువులు పేదరికం, కులమత భేదం అని అన్నారు. నేడు సమాజంలో ఎంతో మంది దళిత, వెనకబడిన వర్గాల కవులు, కళాకారులు, రచయితలు ఉన్నప్పటికీ, జాషువా లాంటి నికా ర్సైన ప్రతిఘటన వారిలో కనబడదు. చాలామంది అగ్రకుల పాలకుల పక్షాన నిలబడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ద్వీప స్తంభం లేకుండా ప్రయాణిస్తున్నారు. ఇప్పటికీ అగ్రకులాల కనుసన్నల్లో నడిచే అభ్యుదయ, విప్ల వ కవిత్వంలోనే దళిత విముక్తి ఉందనుకోవడం గమనార్హం. స్వశక్తితో నడిచే అణగారిన వర్గాల బానిసత్వ విముక్తి ఉద్యమాలకు తోడుగా రచనలు సాగాలి. అప్పుడే అవి ప్రజాధారణ పొందుతాయి. ఇదే జాషువాకు నిజమైన నివాళి.
వ్యాసకర్త సెల్: 7989579428
సంపతి రమేష్






