calender_icon.png 15 January, 2026 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా గోదా రంగనాథుల కల్యాణం

15-01-2026 12:45:00 AM

బెజ్జంకి,జనవరి 14:సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ధనుర్మాసంలో నిర్వహించే గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణం బుధవారం ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్ అధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అలయ అర్చకులు గోదా దేవి రంగనాథుల కళ్యాణం వేద మంత్రోచ్ఛారణ ల తో సంప్రదాయ బద్ధంగా జరిపించారు.

సందర్భంగా ఆలయ ప్రాంగణమంత గోవిందా నమ స్మరణతో మారుమోగింది. కల్యాణానికి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కళ్యాణం లో సర్పంచ్ బొల్లం శ్రీధర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,వార్డ్ సభ్యులు, ఆలయ అర్చకులు తదితరులు హజరయ్యారు.