calender_icon.png 18 July, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

18-07-2025 12:00:00 AM

  1. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ 
  2. సింగూరు ఎడమ కాలువ ద్వారా నీరు  విడుదల

ఆందోల్(సంగారెడ్డి), జూలై 17(విజయక్రాంతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా  ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సింగూర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా అందోల్ నియోజకవర్గంలోని పుల్కల్, చౌటకూర్, ఆందోల్ మండలాలలో ఖరీఫ్ పంటల సాగు కోసం 100 క్యూసెక్కుల నీటిని మంత్రి రాజనర్సింహ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో వర్షాలు లేకున్నప్పటికీ సింగూర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నియోజకవర్గంలోని ఆయకట్టుకు సాగునీరు అందించడం కోసం ప్రభుత్వం మొదటి విడతలో 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఈ నీటితో ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలు నింపడంతో పాటు పంటలు సాగు రైతులకు కొరకు  ప్రారంభించినట్లు  మంత్రి తెలిపారు . సింగూరు నుండి ఆకట్టుకు నిరు విడుదల కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పుల్కల్ విద్యా సంస్థలను తనిఖీ చేసిన మంత్రి.. 

మండల కేంద్రమైన పుల్కల్లోని కేజీబీవీపీ పాఠశాల, జూనియర్ కళాశాల, మోడల్ పాఠశాలలను మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా విద్యాసంస్థల నుండి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మర్చనున్నట్లు తెలిపారు. పాఠశాల, కళాశాలల్లో మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో పాండు, ఇరిగేషన్ ఈఈ భీమ్, సింగూర్ డ్యామ్ డీఈ  నాగరాజు, ఏఈ మహిపాల్ రెడ్డి, శకుంతల సంబంధిత  అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.