calender_icon.png 18 July, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు

18-07-2025 12:00:00 AM

గజ్వేల్,జులై 17: ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు ఉంటాయని ఆత్మ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాయని యాదగిరి లు అన్నారు.  ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా  క్యాసారంలో రైతుల పొలాల్లో ఏడీఏ  బాబు నాయక్ తో కలిసి ఆయిల్ పామ్ మొక్కలు నాటారు .

ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ మన జిల్లాలో సుమా రు 12వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ ను రైతులు సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు వెయ్యి టన్నుల ఆయిల్ ఫామ్ గెలలు పండించి రైతులు ఆదాయం పొందారున్నారు. ఆగస్టు నెలలో  జిల్లాలో నంగునూరు మండలంలో ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని  . మార్కెటింగ్ ఇబ్బందులు తలెత్తకుండా గజ్వేల్  డివిజన్ లో  కలెక్షన్ సెంటర్ మంజూరు చేసినట్లు తెలిపారు .

ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ ఫామ్ పంట మంచి లాభదాయకమైనదని రైతులు సాగు చేయడానికి ముందుకు రావాలని రైతులకు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సూచించిన విధంగా ఆయిల్ పామ్ పంట సాగు చేసి మంచి ఆదాయం పొందాలన్నారు . ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగరాజు,  ఏఎంసి డైరెక్టర్లు, ఆత్మ డైరెక్టర్లు  ఏఈఓలు, రైతులు పాల్గొనడం జరిగింది.