calender_icon.png 9 August, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఉండాలి

09-08-2025 12:40:59 AM

మహబూబ్ నగర్ ఆగస్టు 8 (విజయ క్రాంతి) : ప్రజల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఉండాలని మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వెంకటేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అందించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసంమన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ బీసీలకు అత్యధికంగా రిజర్వేషన్ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అందిస్తే తప్పేముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు ఎదగడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని విమర్శించారు.

మాయ మాటలు చెబుతూ బీసీలకు తీవ్ర అన్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీరక విధాలుగా మాట్లాడుతుందని ఇది సరైన పద్ధతి కాదన్నారు. తమిళనాడు వంటి రాష్ట్రంలో బీసీలకు అత్యధికంగా రిజర్వేషన్ ఉందని, తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, కాంగ్రెస్ నేతలు సిరాజ్ ఖాద్రీ, బెనహర్, చంద్రకుమార్, గోవింద్ యాదవ్, నాగరాజు యాదవ్ తదితరులు