calender_icon.png 22 August, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

22-08-2025 12:43:06 AM

నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి 

వెల్దుర్తి, ఆగస్టు 21 : పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ రాజ్యంలో  పేదల సొంతింటి కల నెరవేరిందని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి  అన్నారు. గురువారం వెల్దుర్తి మండలంలోని ధర్మారం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదలకు సుపరిపాలన అందించడంలో విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సుపరిపాలన అందిస్తుందని అన్నారు. పేదవారి సంక్షేమాన్ని ,అభివృద్ధిని కోరుకునే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎల్లప్పుడూ ఆదరించాలని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా నూతన గృహప్రవేశం చేసిన దంపతులకు ఆవుల రాజిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు తలారి మల్లేశం జగ్గ శంకరయ్య, మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలు కొత్త ముక్తాబాయి, తదితరులుపాల్గొన్నారు.