calender_icon.png 22 August, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రసాయన ఎరువులకు దీటుగా నానో యూరియా

22-08-2025 12:44:27 AM

నానోతో పర్యావరణ పరిరక్షణ, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట, ఆగస్టు 21 : నానో యూరియా తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో రైతు ఆంజనేయులు నానొ  యూరియా వాడకాన్ని డీఏవోతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నానో యూరియా వాడకం వల్ల దిగుబడిలో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని అత్యంత ప్రయోజనకారిగా ఉన్న నానో యూరియాని రైతులు వాడే విధంగా చూడాలన్నారు.

సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియా తక్కువ మొత్తంలో వాడడం వల్ల..ఇది మట్టి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులతో సమావేశం ఏర్పరచి నానో యూరియా వాడకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.  

జిల్లాలో సరిపడా యూరియా...

ఆగస్టు మాసం అవసరం మేరకు ఎరువుల సరఫరా చేయడం జరిగిందని, ఎలాంటి ఎరువుల కొరత లేకపోయిన సెప్టెంబర్ మాసములో కొనుగోలు చెయ్యవలసిన రైతులు కూడా ఇపుడే కొనుగోలు చేయడం వల్ల ఎరువుల దుకాణాల వద్ద రద్దీ ఏర్పడుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో  రాబోవు 10 రోజుల్లో సుమారుగా 1000 నుండి1500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి రానున్నదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, మండల వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.